Karimnagar RTC: మహాలక్ష్మీ జోరు.. చొప్పదండిలో ఆర్టీసీ హోరు!
Karimnagar RTC: మహాలక్ష్మీ పథకంతో పెరిగిన రద్దీ దృష్ట్యా చొప్పదండి నియోజకవర్గంలో ఆర్టీసీ సదుపాయాలు పెంచాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.
Karimnagar RTC: మహాలక్ష్మీ జోరు.. చొప్పదండిలో ఆర్టీసీ హోరు!
Karimnagar RTC: మహాలక్ష్మీ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో… రవాణా సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం పాల్గొని… నియోజకవర్గంలో బస్సుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలని కోరారు. ముఖ్యంగా బస్ స్టేషన్ల అభివృద్ధి, కొత్త బస్సుల కేటాయింపు, అలాగే కొత్త రూట్లలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.