Rajanna Sircilla: స్వల్పంగా తగ్గిన మిడ్ మానేర్ నీటి మట్టం!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటి మట్టం స్వల్పంగా తగ్గింది.

Update: 2026-03-29 02:22 GMT

Rajanna Sircilla: స్వల్పంగా తగ్గిన మిడ్ మానేర్ నీటి మట్టం!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ తాజా పరిస్థితిని పరిశీలిస్తే… నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.

ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్ నీటి మట్టం 309.48 మీటర్ల వద్ద నమోదైంది. మొత్తం నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.595 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.

ఇన్‌ఫ్లోలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితిలో… అవుట్‌ఫ్లోలు మాత్రం కొనసాగుతున్నాయి. మొత్తం 1810 క్యూసెక్కుల నీటిని వివిధ కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా రైట్ గేట్, రైట్ మైన్ కాలువల ద్వారా ఎక్కువగా నీటి విడుదల జరుగుతోంది.

ఇక స్పిల్‌వే గేట్ల విషయానికి వస్తే… 25 గేట్లలో 10 గేట్లు తెరిచి ఉంచి, ప్రతి గేట్‌ను సగం మీటర్ మేర ఎత్తి నీటిని వదులుతున్నారు.

Tags:    

Similar News