Adilabad: భక్తులే ప్రాణంగా 5 రోజులు నడక.. కొండగట్టు చేరిన వింత అతిథి
Adilabad: ఆదిలాబాద్ నుంచి కొండగట్టు వరకు 130 కిలోమీటర్ల మేర హనుమాన్ భక్తులతో కలిసి ఒక శునకం పాదయాత్ర చేసింది.
Adilabad: భక్తులే ప్రాణంగా 5 రోజులు నడక.. కొండగట్టు చేరిన వింత అతిథి
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ నుంచి హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ కోసం జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ భక్తి ప్రయాణంలో ఒక ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో భక్తులు ఇచ్చిన బిస్కట్ తిన్న ఓ శునకం, వారితోనే అనుబంధం పెంచుకుని ప్రయాణాన్ని కొనసాగించింది. ఐదు రోజుల పాటు సుమారు 130 కిలోమీటర్ల దూరం నడిచిన ఆ శునకం, కాళ్ల నొప్పులతో అలసిపోయినా భక్తులను వదలకుండా ముందుకు సాగింది. దాని పరిస్థితిని గమనించిన భక్తులు శునకానికి సాక్సులు తొడిగించి తమతో పాటు తీసుకెళ్లడం విశేషం. వెళ్లగొట్టినా తిరిగి వారినే చేరుకున్న ఆ శునకం, చివరకు కొండగట్టు చేరి భక్తులతో కలిసి ఆలయానికి ప్రవేశించడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. భక్తి, అనుబంధం కలిసిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.