Sircilla: సహారా బాధితుల పోరుబాట.. బోయిన్‌పల్లిలో సిపిఎం గర్జన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లిలో సహారా ఇండియా బాధితుల ఆందోళన. సిపిఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి పిలుపు.

Update: 2026-03-29 07:44 GMT

Sircilla: సహారా బాధితుల పోరుబాట.. బోయిన్‌పల్లిలో సిపిఎం గర్జన!

Sircilla: సహారా ఇండియా గ్రూప్‌లో డబ్బులు డిపాజిట్ చేసిన బాధితులు తమ నిధులు వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తూ బాధితులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ, అధిక వడ్డీ ఆశతో సహారా ఇండియా గ్రూప్‌లో ప్రజలు తమ కష్టార్జిత డబ్బులను వివిధ పథకాలలో పెట్టుబడిగా పెట్టారని తెలిపారు.

అయితే కంపెనీ మూతపడిన తర్వాత గడువు పూర్తయినా డిపాజిటర్లకు డబ్బులు తిరిగి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకొని ఏడాదిలోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించాలని చెప్పినా, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు, షరతులు విధిస్తూ చెల్లింపులను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. సహారా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ బాధితులు విసిగి పోయారని, ఇప్పటికైనా ఎలాంటి షరతులు లేకుండా డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో రాబోయే రోజుల్లో సహారా బాధితులందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మరియు సహారా బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News