Cold Weather: తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత.. నాలుగు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
Cold Weather: తెలంగాణలో రెండురోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం, గురువారాల్లో పలు జిల్లాల్లో చలి తీవ్రత నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరించింది.
ఆయా జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని తెలిపింది. రాబోయే మూడు రోజులు అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది. రెండు రోజుల పాటు పలు చోట్ల సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని తెలిపింది. రాబోయే కొద్దిరోజులు పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో 5 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.