Revanth Reddy: ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Revanth Reddy: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు (డిసెంబర్ 4, గురువారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2025-12-04 05:33 GMT

Revanth Reddy: ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Revanth Reddy: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు (డిసెంబర్ 4, గురువారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లావ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం, జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ చేరుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత, ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించనున్నారు. జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఎయిర్‌పోర్టు (విమానాశ్రయం) ఏర్పాటుపై కూడా సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags:    

Similar News