CM Revanth Reddy: బీజేపీకి ఎన్నికలప్పుడే రాముడు గుర్తుకొస్తాడు
CM Revanth Reddy: ఎన్నికలు రాగానే బీజేపీకి రాముడు, హనుమంతుడు గుర్తుకువస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.
CM Revanth Reddy: బీజేపీకి ఎన్నికలప్పుడే రాముడు గుర్తుకొస్తాడు
CM Revanth Reddy: ఎన్నికలు రాగానే బీజేపీకి రాముడు, హనుమంతుడు గుర్తుకువస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. నర్సాపూర్, సరూర్‌నగర్‌లో నిర్వహించిన జనజాతర సభల్లో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ ఇచ్చింది ఏమి లేదన్నారు. ఓట్ల కోసం దేవుడి పేరును వినియోగిస్తే ఆయన సైతం క్షమించడన్నారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు. బీజేపీ వాళ్లు మనకు సాంప్రదాయాలు నేర్పాలా అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ రాజ్యంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డునిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందేనని పిలుపునిచ్చారు.