Revanth Reddy: మేడారం, బాసర ఆలయాలపై సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy: మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Update: 2025-09-08 10:08 GMT

Revanth Reddy: మేడారం, బాసర ఆలయాలపై సీఎం రేవంత్ సమీక్ష 

Revanth Reddy: మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను సీఎంకు అధికారులు వివరించారు. మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను రేవంత్‌ పరిశీలించారు. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని తెలిపారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాలవారీగా చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు చేశారు. అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు.

Tags:    

Similar News