Revanth Reddy: మల్కాజ్‌గిరి ప్రజల స్థానం నా గుండెల్లో శాశ్వతం
Revanth Reddy: నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్‌గిరి ప్రజలదే
Revanth Reddy: మల్కాజ్‌గిరి ప్రజల స్థానం నా గుండెల్లో శాశ్వతం
Revanth Reddy: మల్కాజ్‌గిరి లోక్ సభ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అప్రతిహత అధికారాన్నే అస్త్రంగా చేసుకుని, అణచివేతనే మార్గంగా ఎంచుకుని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకే లేకుండా చేయాలని పాలకులు కక్ష కట్టినప్పుడు... తెలంగాణ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్ గిరి అన్నారు రేవంత్. కొడంగల్‌లో పోలీసు లాఠీలు పడి, నడి రాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన సందర్భాన్ని చూసి, చలించిన మల్కాజ్ గిరి...ఆరు నెలలు తిరగక ముందే తనను తమ గుండెల్లో పెట్టుకుందన్నారు.
తన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగరేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజ్ గిరిలోనే అన్నారు రేవంత్ రెడ్డి. తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ కు ఎంతటి ప్రాధాన్యత ఉందో... మల్కాజ్ గిరికి అంతే ప్రాధాన్యత ఉంటుందన్నారు. మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటానని.. చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.