Kamareddy: ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈనెల 15న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Kamareddy: రూ.350 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2023-09-08 06:45 GMT

Kamareddy: ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈనెల 15న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Kamareddy: కామారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈనెల 15న ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నిర్మించిన మరో తొమ్మిది కాలేజీలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే కామారెడ్డి వైద్య కళాశాలను కూడా ప్రారంభిస్తారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో తరగతులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కళాశాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులతో పలుమార్లు సమీక్షించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

దీంతో కళాశాలలో నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు అధికారులు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డికి మెడికల్ కాలేజీ వస్తుందని కేసీఆర్ ప్రకటించారు. మొదటి విడతలో మంజూరవుతుందని భావించినా కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ కోసం తెలంగాణ ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

Tags:    

Similar News