మాస్క్ ధరించిన సీఎం కేసీఆర్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఈ రోజు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఈ రోజు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం మాస్క్ ధరించి హాజరయ్యారు. సమీక్ష నిర్వహించడానికి ముందు సీఎం చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నారు.
తెలంగాణలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉత్తర్వులను తాము కూడా అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజలకు సందేశం ఇవ్వడానికే సీఎం మాస్కును ధరించారు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం కోసం మాస్క్ ధరించాలని సూచించారు.
ఇక పోతే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిక నివారణకు చేపడుతున్న చర్యలు, లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, పేదలకు అందుతున్న సాయం గురించి ఈ సమావేశంతో మాట్లాడారు. అంతే కాక రైతులు పండిస్తున్న పంట ఉత్పత్తుల కొనుగోళ్ల విషయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. పైన తెలిపిన అంశాలపై ఈ ఒక్క రోజు మాత్రమే కాకుండా ప్రతి రోజు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇక మరోవైపు కరోనా బాధితులకు ఆదుకోవడానికి గాను పలువురు ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళం అందజేయడానికి ప్రగతిభవన్‌కు వస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే ఆయన ముందు జాగ్రత్త చర్యగా మాస్క్ ధరించి సమావేశాల్లో పాల్గొంటున్నారు.