ఇవాళ సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌లో కేసీఆర్ సభలు
ఇవాళ సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో నిర్వహించే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సీఎం సభ కోసం భారీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నాం 2గంటలకు సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వద సభకు రానున్నారు. సభ కోసం కరస్‌గుత్తి రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తుండగా, సభాస్థలి సమీపంలోనే హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వచ్చినా అనంతరం సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ ఇక్కడి రావడం ఇదే మొదటి సారి. దీంతో సీఎం ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఎలాంటి అవాక్కులు, చావక్కులు పేల్చుతారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు జుక్కల్ బాన్సువాడలో సైతం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.