Telangana: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు కేసీఆర్ శుభవార్త

Telangana: పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా చేయడం వ‌ల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Update: 2021-03-26 10:02 GMT

Telangana: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు కేసీఆర్ శుభవార్త 

Telangana: పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా చేయడం వ‌ల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. హరితహారం ప్రారంభమైన కొత్తలో పంచాయతీల్లో మొక్కలు చనిపోయేవన్న ముఖ్యమంత్రి చట్టాన్ని పటిష్టంగామార్చడం కారణంగానే హ‌రిత‌హారంలో నాటిన మొక్క‌లు బ‌తుకుతున్నాయని వ్యాఖ్యానించారు.

అలాగే జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సీఎం శుభవార్త చెప్పారు. అంద‌రూ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల మాదిరిగానే జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు ఈ ఏప్రిల్ నుంచే రెగ్యుల‌ర్ పీఎస్‌ల‌కు ఇచ్చిన జీతాలు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ ప్రొబేష‌న‌రీ పీరియ‌డ్‌ను మ‌రో ఏడాది పెంచుతాం.. క‌డుపు నిండా జీతం ఇస్తాం. ఈ విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. త‌మ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డ‌కుండా ప‌ని చేస్తోంద‌న్నారు.

Tags:    

Similar News