Cylone Gulab: భారీ వ‌ర్షాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు..

Cylone Gulab: భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Update: 2021-09-27 10:46 GMT

Cylone Gulab: భారీ వ‌ర్షాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు..

Cylone Gulab: భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గులాబ్ ఎఫెక్ట్‌తో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ మరోసారి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సచివాలయానికి అందివ్వాలని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే హైద‌రాబాద్‌, కొత్త‌గూడెం, వ‌రంగ‌ల్ జిల్లాల్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. లోత‌ట్టు ప్రాంతాలు, చెరువులు, కుంట‌లు, బ్రిడ్జిల వ‌ద్ద ప్ర‌త్యేకంగా అధికారుల‌ను నియ‌మించి ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని సీఎస్ ఆదేశించారు.

Tags:    

Similar News