CM KCR: ఏమరపాటుగా ఓటు వేస్తే.. భవిష్యత్‌ ఆగమవుతుంది

CM KCR Public Meeting: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

Update: 2023-11-02 11:22 GMT

CM KCR: ఏమరపాటుగా ఓటు వేస్తే.. భవిష్యత్‌ ఆగమవుతుంది

CM KCR Public Meeting: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా కూడా తనకు మోతె గ్రామం గుర్తొస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందు రాష్ట్రం కావాలని తీర్మానం చేసిన గ్రామం మోతె అని అన్నారు. ఆ గ్రామం మట్టిని తాను ముడుపు కట్టి హైదరాబాద్ తీసుకెళ్లానని గుర్తు చేశారు. మోతె గ్రామస్తులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు కేసీఆర్.

ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఎన్నికల్లో ఏది మాట్లాడినా చెల్లుబాటవుతుందని కొందరు నేతలు భావిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ.. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా పెరగలేదని అన్నారు. ఏమరుపాటుగా ఓటు వేస్తే.. మన భవిష్యత్‌ ఆగమవుతుందని హెచ్చరించారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్‌ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలి. దేశంలో తెలంగాణ మాత్రమే 24 గంటల కరెంట్‌ ఇస్తోంది. చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ.. తలసరి విద్యుత్‌ వినియోగంలో ముందుంది అని కేసీఆర్‌ అన్నారు.

ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చిపట్టిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. బోరుకాడ మీటర్లు పెట్టి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిప్డారు. కాంగ్రెస్, బీజేపీకి అధికారం ఇస్తే ఏం చేశారో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ ఇబ్బందులేనని, రైతాంగం ఆగమైందని గుర్తు చేశారు. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిణతి పెరగాలని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News