Khammam: తుమ్మల ర్యాలీ ఎఫెక్ట్.. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు సీఎం పిలుపు..
KCR: ఖమ్మంలో తుమ్మల చేపట్టిన ర్యాలీ అక్కడి బీఆర్ఎస్ నేతలపై ప్రభావాన్ని చూపించింది.
Khammam: తుమ్మల ర్యాలీ ఎఫెక్ట్.. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు సీఎం పిలుపు..
KCR: ఖమ్మంలో తుమ్మల చేపట్టిన ర్యాలీ అక్కడి బీఆర్ఎస్ నేతలపై ప్రభావాన్ని చూపించింది. దీంతో పార్టీలో పరిణామాలపై చర్చించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు గులాబీ బాస్ పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇర బీఆర్‌ఎస్ అధినేత పిలుపుతో ఖమ్మం ఉమ్మడి జిల్లా నేతలు ప్రగతిభవన్‌కు బయల్దేరినట్లు సమాచారం. టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావును బుజ్జగించే ప్రయత్నాలు విఫలంకావడంతో గులాబీ బాస్ పార్టీ పరిస్థితిపై దృష్టి సారించినట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే శుక్రవారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లిన తుమ్మలకు ఆయన అనుచరులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ అనంతరం తుమ్మల ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో ప్రభావంపై నేతలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. దీంతో పాటు పార్టీలోని పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.