Hyderabad: జీహెచ్‌ఎంసీకి నలుమూలలా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం

Hyderabad: ఆస్పత్రుల నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం కేసీఆర్

Update: 2022-04-26 10:30 GMT

Hyderabad: జీహెచ్‌ఎంసీకి నలుమూలలా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం

Hyderabad: జీహెచ్‌ఎంసీకి నలుమూలలా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని అల్వాల్‌, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఒక్కో ఆస్పత్రిని 13.71 లక్షల చదరపు విస్తీర్ణంలో నిర్మించనున్నారు. గడ్డి అన్నారం ఆస్పత్రికి 900 కోట్లు, అల్వాల్‌కు 897 కోట్లు, ఎర్రగడ్డ ఆస్పత్రికి 882 కోట్లు కేటాయించారు.

అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 28.41 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఇందులో జీ ప్లస్ 5 అంతస్తులు నిర్మిస్తారు. గడ్డి అన్నారం ఆసుపత్రికి 21.36 ఎకరాలను కేటాయించగా జీ ప్లస్ 14 అంతస్తులు నిర్మించనున్నారు. ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 17 ఎకరాలు కేటాయించగా.. ఇక్కడ జీ ప్లస్ 14 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి.

ఈ ఆస్పత్రుల్లో అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లభిస్తాయి. ఒక్కో ఆస్పత్రిని వేయి పడకలతో నిర్మించనున్నారు. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయి.

Tags:    

Similar News