మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
Medchal District: మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
Medchal District: మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. శామీర్ పేట మండలం అంతాయిపల్లిలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్ భవనం దగ్గర కేసీఆర్ పూజలు చేశారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.