CM KCR: వైద్యశాఖ బలోపేతంపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్‌

CM KCR: ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Update: 2021-06-10 07:56 GMT

సీఎం కేసీఆర్‌(ఫైల్ ఇమేజ్ )

CM KCR: ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వైద్యశాఖ బలోపేతంపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. ప్రైవేట్‌ ఆస్పత్రులను ధీటుగా ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అన్ని జిల్లాల ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లతో పాటు అన్ని వ్యాధులకు మందులు, ట్రీట్‌మెంట్‌ను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతోంది. కరోనా, బ్లాక్ ఫంగస్‌తో పాటు థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు హాస్పిటల్‌ను రెడీ చేస్తోంది టీ సర్కార్‌.

తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్‌ ప్రభుత్వం ఉచిత డయాగ్నొస్టిక్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పలు జిల్లాల్లో టెస్టులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయించుకునే వీలు కల్పించింది. మరోపక్క రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కోవిడ్‌ టీకా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇప్పటికే సూపర్‌ స్ప్రెడర్లకు విడతల వారీగా వ్యాక్సిన్‌ ఇస్తోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం.

Tags:    

Similar News