మునుగోడు రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి
CM KCR: మునుగోడు టీఆర్ఎస్ నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించుకున్న సీఎం
మునుగోడు రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి
CM KCR: హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు మునుగోడు పాలిటిక్స్ చేరుకున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షాతో భేటీపై సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. మునుగోడు టీఆర్ఎస్ నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించుకున్న సీఎం మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ఇతర టీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరితే ఉపఎన్నిక అనివార్యం కానుంది. దీంతో కేసీఆర్ నుగోడుపై సీరియస్ గా దృష్టి సారించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, పీకే సర్వేపై చర్చించారు. కొత్త మండలం ఏర్పాటు కోసం గట్టుప్పల వాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ పొలిటికల్ హీట్‌లో గట్టుప్పలను మండలంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు.