Karnataka Road Accident: సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా..
Rs 3 Lakh Ex-Gratia: కర్నాటక రాష్ట్రంలోని కలబురగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి...
Karnataka Road Accident: సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా..
Rs 3 Lakh Ex-Gratia: కర్నాటక రాష్ట్రంలోని కలబురగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేల పరిహారాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పార్థివ దేహాలను వారి స్వస్థలాలకు తరలించడం, క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సీఎం ఆదేశించారు.