CM KCR: ఆగస్టు 15 నుంచే కొత్త పింఛన్లు.. వారికి కూడా...

CM KCR: దేశంలోనే ఒంటరి మహిళలకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం కేసీఆర్.

Update: 2022-08-06 13:22 GMT

CM KCR: ఆగస్టు 15 నుంచే కొత్త పింఛన్లు.. వారికి కూడా...

CM KCR: దేశంలోనే ఒంటరి మహిళలకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో 57ఏళ్లకే పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, ఇప్పుడు కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు అమల్లోకి వస్తాయన్నారు కేసీఆర్.

అలాగే డయాలసిస్‌ పేషెంట్లకు కూడా 2వేల 16 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు కేసీఆర్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని జైళ్లశాఖను ఆదేశించినట్టు సీఎం తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు కూడా పింఛన్లు ఇస్తున్నామని, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకునే రోగులకు కూడా పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.

Tags:    

Similar News