Tummala Nageswara Rao: తుమ్మల ఇంటికి సీఎల్పీ నేత భట్టి

Tummala Nageswara Rao: గతంలో తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌, పొంగులేటి

Update: 2023-09-03 06:14 GMT

Tummala Nageswara Rao: తుమ్మల ఇంటికి సీఎల్పీ నేత భట్టి

Tummala Nageswara Rao: రోజు రోజుకు ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తుమ్మల ఇంటికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెళ్లడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తుమ్మలతో సీఎల్పీ నేత భట్టి భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. ఇక.. తుమ్మల నివాసానికి అనుచరులు కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో తుమ్మలను రేవంత్‌రెడ్డి, పొంగులేటి కూడా కలిశారు. తుమ్మలను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తుమ్మల కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి మరింత జోష్‌ వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. అయితే.. ఇప్పటివరకుు పార్టీ మార్పుపై తుమ్మల ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఖమ్మం రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి.

Tags:    

Similar News