Bhatti Vikramarka: పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అస్వస్థత
Bhatti Vikramarka: వేసవి తీవ్రతను తట్టుకోలేకపోయిన భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అస్వస్థత
Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థకు గురైన భట్టి విక్రమార్క కదిలేందుకు ఇబ్బందిపడ్డారు. డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ వచ్చి భట్టి విక్రమార్క ఆరోగ్యన్నీ పరీక్షించారు. ప్రమాదకరమైన ఎండల్లో పాదయాత్ర చేయడం ఆరోగ్యకరం కాదని డాక్టర్ తెలిపారు. షుగర్ లెవెల్స్ తగ్గి, ఎండలకు వందల కిలోమీటర్లు దూరం నడవడం వల్ల ఫ్లూయిడ్స్ బాగా తగ్గాయని డాక్టర్ చెప్పారు.
తీవ్రమైన ఎండలకి వందల కిలోమీటర్లు నడవడం వల్ల.. వడ దెబ్బ, డీ హైడ్రేషన్ కు భట్టి విక్రమార్క గురయ్యారాని డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు భట్టి విక్రమార్కకు పూర్తిగా అబ్జర్వేషన్ అవసరం అని తెలిపారు. రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్ సూచించారు. డాక్టర్ గారి సూచనల మేరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత యాధా విధిగా పాదయాత్ర సాగుతుందని భట్టి విక్రమార్క సంబంధీకులు తెలిపారు.