CJI NV Ramana: కీలక నిర్ణయం.. తీరిన తెలంగాణ హైకోర్టు చిరకాల కోరిక

CJI NV Ramana: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ సీజేఐ నిర్ణయం తీసుకుంది.

Update: 2021-06-09 12:00 GMT

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ(ఫైల్ ఇమేజ్ )

CJI NV Ramana: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ సీజేఐ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా సుప్రీంకోర్టుకు చేస్తున్న విజ్ఞప్తులకు తాజాగా పరిష్కారం లభించింది. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెరిగింది. వీరిలో పర్మినెంట్‌ జడ్జిలు 32 మంది, అడిషనల్‌ జడ్జిలు 10 మంది ఉన్నారు. న్యాయ‌మూర్తుల సంఖ్య‌ను పెంచాల‌ని హైకోర్టు రెండు సంవ‌త్స‌రాలుగా సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి మేరకు సీజేఐ కీలక నిర్ణయం తీసుకున్నారు. జ‌డ్జిల సంఖ్య‌ను పెంచ‌టం ప‌ట్ల తెలంగాణ న్యాయ‌వాదులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Full View


Tags:    

Similar News