Representational Image
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల, వెల్జీపూర్ గ్రామాల మధ్య చిరుత సంచరిస్తోంది. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. తాజాగా వల్లంపట్ల శివారులో ఓ లేగదూడను చంపిన చిరుత బతుకమ్మ చెరువు దగ్గర తన ఇద్దరి పిల్లలతో కనిపించింది. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుతను తరిమేందుకు కర్రలతో బయల్దేరగా పిల్లలను తీసుకొని చిరుత అక్కడి నుంచి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.