CEC Tour In TS: తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు సీఈసీ టూర్
CEC Tour In TS: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీఐ బృందం పర్యటన
CEC Tour In TS: తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు సీఈసీ టూర్
CEC Tour In TS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని 17మంది అధికారుల బృందం రాష్ట్రానికి రానున్నారు. మూడ్రోజుల పాటు నిర్వహించే విస్తృత సమీక్ష కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సన్నాహాక చర్యల్లో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు పలు సమీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులను భేటీకి ఆహ్వానించారు. సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు ఎన్నికల విధుల్లో భాగమయ్యే దాదాపు 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో భేటీ అవుతారు. సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రజెంటేషన్ ఇస్తారు.