RS Praveen Kumar: పింఛన్లకు పైసల్లేవ్ కానీ..
RS Praveen Kumar: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం న్యూస్ పేపర్స్ యాడ్స్‌కి...
RS Praveen Kumar: పింఛన్లకు పైసల్లేవ్ కానీ..
RS Praveen Kumar: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం న్యూస్ పేపర్స్ యాడ్స్‌కి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందని విరుచుకుపడ్డారు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీన దేశవ్యాప్తంగా ఇచ్చిన పత్రికా ప్రకటనల ఖర్చు కనీసం రూ.30 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. పింఛన్లు లేక అవ్వా తాతలు ఏడుస్తుంటే.. ఏం వెలగపెట్టారని ఇతర రాష్ట్రాల పత్రికలకు కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని రూ. 5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని. ఈ దోపిడీ మీకింకా సరిపోలేదా..? అని గురువారం ఓ ట్వీట్ చేశారు.