Lok Sabha Election 2024: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్
Lok Sabha Election 2024: వరంగల్ లోక్‌సభ బీఆర్ఎస్ టికెట్ పై క్లారిటీ వచ్చేసింది. మారేపల్లి సుధీర్ కుమార్ ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
Lok Sabha Election 2024: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్
Lok Sabha Election 2024: వరంగల్ లోక్‌సభ బీఆర్ఎస్ టికెట్ పై క్లారిటీ వచ్చేసింది. మారేపల్లి సుధీర్ కుమార్ ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. వరంగల్ జిల్లా ముఖ్యనేతలతో చర్చల అనంతరం సుధీర్ పేరును గులాబీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. మారేపల్లి సుధీర్ ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా ఉన్న సుధీర్ పేరును జిల్లా పార్టీ ముఖ్యనేతలు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తోంది.
మొదట వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియ కావ్యను ప్రకటించారు. అయితే వారిద్దరు కాంగ్రెస్‌లో చేరడంతో మళ్లీ అభ్యర్థి కోసం వరంగల్ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే తాటికొండ రాజయ్యతో పాటు పలువురి పేర్లను పరిశీలించారు. సుధీర్ఘ మంతనాల అనంతరం డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును అధికారికంగా ప్రకటించారు కేసీఆర్.