ఆటో సమస్యలపై బీఆర్‌ఎస్ పోరుబాట

ఆటో డ్రైవర్ల బతుకులను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు మాజీమంత్రి హరీష్‌రావు.

Update: 2025-10-27 07:06 GMT

ఆటో సమస్యలపై బీఆర్‌ఎస్ పోరుబాట

ఆటో డ్రైవర్ల బతుకులను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు మాజీమంత్రి హరీష్‌రావు. ఆటో కార్మికులకు రేవంత్ ప్రభుత్వం 15 వందల కోట్లు బాకీ పడిందని.. వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ ఢిల్లీకి మూటలు పంపుతున్నారు కానీ.. ఆటో కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఆటో కార్మికుల సమస్యలు తీర్చాలనే సోయి రాహుల్‌ గాంధీకి లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఆటో డ్రైవర్ల సమస్యలపై BRS పోరుబాట పట్టింది. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. మాజీమంత్రి హరీశ్‌ రావు కోకాపేట నుంచి ఎర్రగడ్డ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్‌ వరకు ఆటోలో ప్రయాణించారు.

Tags:    

Similar News