BRS: కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్

BRS: హామీల అమలులో అలసత్వం చేస్తున్నారని మండిపాటు

Update: 2024-01-03 08:49 GMT

BRS: కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్

BRS: తెలంగాణ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలను అలగావి హామీలు ఇచ్చిందని ఆరోపించింది. ఇందులో భాగంగానే 420 హామీల పేరిట బుక్‌లెట్‌ రిలీజ్ చేసింది భారత రాష్ట్ర సమితి. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే‎ ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చారంటూ ఆరోపించింది. హామీలను అమలు చేయడంలో అలసత్వం చేస్తున్నారని.. అందుకే ఆ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్‌లెట్‌ను తయారు చేసినట్లు బీఆర్ఎస్ తెలిపింది.

కాంగ్రెస్ ఇచ్చింది ఆరు హామీలు కాదు. 420 హామీలంటూ విమర‌్శలు దాడి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు వివిధ డిక్లరేషన్ల సందర్భంగా ఇచ్చిన హామీలను బుక్‌లెట్‌లో ప్రచురించింది బీఆర్ఎస్ పార్టీ. కేవలం 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తామంటే ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ ఒత్తిడి తీసుకొస్తామని బీఆర్ఎస్ తెలిపింది.

Tags:    

Similar News