Karimnagar: కరీంనగర్‌లో బిఆర్ఎస్ కాంగ్రెస్‌ది లోపాయికారి ఒప్పందం..
Karimnagar: బిఆర్ఎస్ నాయకులు దారుణంగా వ్యవహరిస్తుంటే.. పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోరని రోహిత్ రావు నిలదీశారు
Karimnagar: కరీంనగర్‌లో బిఆర్ఎస్ కాంగ్రెస్‌ది లోపాయికారి ఒప్పందం..
Karimnagar: కరీంనగర్‌లో కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పార్లమెంటు సభ్యుడిగా.. జాతీయ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి పట్ల బిఆర్‌ఎస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించారని, రోహిత్ రావు ప్రశ్నించారు. కరీంనగర్ ఇందిరా చౌక్‌లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు అవమానకర రీతిలో వ్యవహరించారని రోహిత్ రావు పోలీసుల పనితీను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి బిఆర్ఎస్ నాయకులు ఓర్వలే పోతున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకులు దారుణంగా వ్యవహరిస్తుంటే.. పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోరని రోహిత్ రావు నిలదీశారు. బిఆర్ఎస్ నాయకులు తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదని, చట్టంద్వారా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు.