BRS: ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం.. ప్రమీల చైర్మన్
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ అధికారం సాధించింది. ఇండిపెండెంట్ మద్దతుతో ప్రమీల చైర్మన్‌గా, హరీశ్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
BRS Captures Indresham Municipality:ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం.. ప్రమీల చైర్మన్
ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న వైస్ ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్‌గా ప్రమీల, వైస్ చైర్మన్‌గా హరీష్‌రెడ్డి ఎన్నిక.
సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా కిషంగుల ప్రమీల, వైస్ చైర్మన్‌గా పటోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇంద్రేశం పురపాలికలో 18 వార్డులు ఉండగా అత్యధికంగా 9 వార్డులను బీఆర్‌ఎస్ గెలుచుకుంది, ఆరు వార్డులు కాంగ్రెస్, రెండు వార్డులు బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. కానీ, నిన్న జరగాల్సిన చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఇవాళ ఎన్నిక నిర్వహించగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.