తెలంగాణ ప్రభుత్వంతో BMS కంపెనీ అవగాహన ఒప్పందం.. సుమారు 100 మిలియన్ డాలర్ల..
Hyderabad: హైదరాబాద్ బయోటెక్నాలజీ, ఐటీ రంగానికి గొప్ప ఆకర్షనీయ గమ్యంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వంతో BMS కంపెనీ అవగాహన ఒప్పందం.. సుమారు 100 మిలియన్ డాలర్ల..
Hyderabad: హైదరాబాద్ బయోటెక్నాలజీ, ఐటీ రంగానికి గొప్ప ఆకర్షనీయ గమ్యంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఎంఎస్ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ నగరంలో మానవ వనరుల నైపుణ్యం వారి కార్యకలాపాలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎంఓయూ ద్వారా 1,500 మందిని నియమించుకుంటామన్న బీఎంఎస్ కంపెనీ త్వరలోనే తమ లక్ష్యాన్ని చేరుకొని మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న నమ్మం తమకు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం సందర్భంగా హైదరాబాద్ ఫార్మాసిటీలో ఉన్న అవకాశాల గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించినట్లు చెప్పారు. రానున్న మూడు సంవత్సరాల్లో తమ కంపెనీ సుమారు 1500 మంది ఉద్యోగులను నియమించుకుంటుందని.. 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.