Telangana: కరోనా తో సర్జరీలకు బ్రేక్‌

Telangana: కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సేవలపై ప్రభావం పడింది.

Update: 2021-04-09 02:40 GMT

Telangana:(File Image)

Telangana: సైలెంట్ గా కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తూ దేశాన్నే కిదిపేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సేవలపై ప్రభావం పడింది. గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా హాస్పిటల్స్‌లో సర్జీలకు బ్రేక్‌ పడింది. అత్యవసర ఆపరేషన్లు మినహా.. మిగతా అన్నింటినీ డాక్టర్లు వాయిదా వేస్తున్నారు. దీంతో డబ్బులు ఖర్చుపెట్టలేక సర్జరీల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బంది పడుతున్నారు.

ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో 11 ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా.. వాటన్నింటిలో కలిపి రోజుకు వంద మైనర్‌, 25 మేజర్‌ ఆపరేషన్లు జరుగుతుంటాయి. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా... రోజుకు 40లోపే ఆపరేషన్లు జరుగుతున్నాయి. అటు గాంధీ ఆస్పత్రిలో 28 ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా.. రోజుకు 150 శస్త్రచికిత్సలు జరిగేవి. గాంధీ ఆస్పత్రిని కూడా కొవిడ్‌ సెంటర్‌గా మార్చడంతో ఆపరేషన్‌ థియేటర్లను మొత్తంగా మూసేశారు.

ఇక కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతున్నప్పటికీ.. అవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా తగ్గిపోయాయి. నిమ్స్‌ యురాలజీ విభాగంలో ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా కీలకమైన గుండే మార్పిడి, కాలేయ మార్పిడి చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎండోస్కోప్‌, కొలనోస్కోపీ టెస్టులు సగానికి పడిపోయాయి. ఇక ప్రస్తుతం జీవన్‌దాన్‌లో 8వేల 633 మంది అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News