Sagar Bypoll: సాగర్‌లో బీజేపీకి షాక్ మీద షాక్
Sagar Bypoll: నాగార్జున సాగర్ శాసన సభ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Sagar Bypoll: సాగర్‌లో బీజేపీకి షాక్ మీద షాక్
Sagar Bypoll: నాగార్జున సాగర్ శాసన సభ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ నేత కడారి అంజయ్య అధికార టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టికెట్ ఆశించిన బీజేపీ నేత కడారి అంజయ్య కాసేపట్లో సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉప ఎన్నిక అభ్యర్థిగా చివరి నిమిషంలో రవి నాయక్‌కు టికెట్ ఇవ్వడంతో కడారి అంజయ్య అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే ఆయనతో టీఆర్ఎస్ శ్రేణులు టచ్‌లో ఉండగా సీఎంతో భేటీ అనంతరం గులాబీ గూటికి చేరే అవకాశాలున్నాయి.