Bhuma Akhila Priya: తండ్రి ఆస్థులను కాపాడుకుంటానని అఖిలప్రియ సవాల్‌

* న్యాయ పోరాటానికి సిద్ధమైన అఖిలప్రియ * సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ రాసేందుకు అఖిలప్రియ సిద్ధం

Update: 2021-07-22 02:31 GMT

భూమా అఖిలప్రియ (ఫైల్ ఫోటో)

Bhuma Akhila Priya: భూవివాదం, కిడ్నప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అఖిలప్రియ ఎదురుదాడికి సిద్ధమయ్యారా.. తన తండ్రి ఆస్థిని కాపాడుకోవడానికి కీలక నిర్ణయం తీసుకోనునున్నారా.. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న అఖిల్‌ప్రియ కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారా.. అఖిలప్రియ అడుగులు ఎటు వైపు సాగుతున్నాయి. తెలంగాణలో అఖిలప్రియకు అండగా నిలబడెదెవరు. సహకరించెదెవరు.?

హైదరాబాద్‌లోని తన తండ్రి ఆస్తులను కాపాడుకోవడానికి అఖిలప్రియ సన్నద్దమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో తన తండ్రి ఆస్థిని పొగొట్టుకోనని సవాల్‌ చేస్తున్నారు. ఇందుకోసం భూమా అఖిలప్రియ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసులు, భూవివాదంపై వాస్తవాలను తెలియజేస్తూ సీఎం కేసీఆర్‌కు అఖిలప్రియ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాయం తీసుకునే ఆలోచనలో అఖిలప్రియ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌ శివారులోని హాఫిజ్‌పేట్‌లో 50 ఎకరాలభూమి విషయంలో భూమా ఫ్యామిలీకి, మరికొందరికి వివాదం నడుస్తోంది. నవాబుల నుంచి ఈ భూమి భూమా నాగిరెడ్డికి సంక్రమించిదని భూమా ఫ్యామిలీ చెబుతోంది. వివాదంలో ఉన్న ఆ భూమి విలువ ప్రస్తుతం సుమారు వేయికోట్ల పైమాట అందుకే ఇరు వర్గాలు రాజీపడలేకపోతున్నాయి. నాగిరెడ్డి మరణంతో భూమా ఫ్యామిలీ ఎన్నో విలువైన స్థలాలను, పొలాలను పొగొట్టుకున్నాయి. కానీ హఫీజ్‌పేట్‌ భూములను మాత్రం ప్రాణాలు పోయిన వదులుకోమంటున్నారు.

అయితే ఈ భూవివాదం గురించి అన్ని వాస్తవాలను తెలియజేసేలా అఖిలప్రియ సీఎంకేసీఆర్‌కు బహిరంగలేఖ రాయనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు భూమికి సంబంధించిన లింక్‌ డాక్యూమెంట్లను కూడా ఈ లేఖకు అటాచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే తమ ఫ్యామిలీపై పోలీసులు చేస్తున్న వేధింపులపై రాష్ట్ర, జాతీయ మానవహక్కుల సంఘానికి అఖిలప్రియ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అటు న్యాయపరంగా, ఇటు రాజకీయపరంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అఖిలప్రియ కసరత్తులు మొదలుపెట్టారు.

Tags:    

Similar News