Bhatti Vikramarka: సాగునీరు, తాగునీరు ఇవ్వరు కానీ.. కాలువలు, చెరువల దగ్గర సంబరాలు చేసుకోమంటారు
Bhatti Vikramarka: కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు బాగుపడ్డారు
Bhatti Vikramarka: సాగునీరు, తాగునీరు ఇవ్వరు కానీ.. కాలువలు, చెరువల దగ్గర సంబరాలు చేసుకోమంటారు
Bhatti Vikramarka: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. ప్రస్తుతం పాలకుల జీవితాలు మాత్రం మారాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న పీపుల్స్ మార్చ్‌లో భాగంగా కొప్పోల్ కార్నర్ మీటింగ్‌లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు భట్టి. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు మాత్రం బాగుపడ్డారని విమర్శించారు. నల్గొండ జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన SLBC ప్రాజెక్ట్.. పదేళ్లయినా పనులు పూర్తికాలేదున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే.. కాలువలు, చెరువుల దగ్గర సంబరాలు చేసుకోవాలని అధికార పార్టీ చెబుతోందని ఎద్దేవా చేశారు.