భద్రాద్రి రామాలయ పూజారికి కరోనా పాజిటివ్

Bhadrachalam Temple Pujari Tests Corona Positive : చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ భద్రాద్రి జిల్లాను వణికిస్తోంది.

Update: 2020-08-08 10:30 GMT
ప్రతీకాత్మక చిత్రం

Bhadrachalam Temple Pujari Tests Corona Positive : చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ భద్రాద్రి జిల్లాను వణికిస్తోంది. జిల్లాల్లోని కార్యాలయాలు, షాపులతో పాటు సాక్షాత్తు శ్రీరాముల వారి సన్నిధిలో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే రామయ్య సన్నిధిలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా మహమ్మారి సోకగా ఇప్పుడు తాజాగా ఆలయంలో పని చేస్తున్న ఒక అర్చకుడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండుకు చేరింది. ఇలా ఆలయంలో ఒకరి తరువాత ఒకరు కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఆలయ సిబ్బంధి ఆందోళన చెందుతున్నారు. వెంటనే వారందరికీ టెస్టులు చేయాలని రామాలయ సిబ్బంది కోరుతున్నారు. ఇక ఇప్పటికే కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(శుక్రవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మృతుల సంఖ్య 615కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,091 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330కి చేరింది. ప్రస్తుతం 21417 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 23,495 మంది నమూనాలను పరీక్షించగా, 2,256 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 464, మేడ్చెల్-138, రంగారెడీ-181, వరంగల్ 187, కరీంనగర్‌ 101, జోగులాంబ గద్వాల జిల్లా 95, సంగారెడ్డి-92, పెదపల్లి 84, భద్రాద్రి కొత్తగూడెం 79, కామారెడ్డి 76, సిరిసిల్ల 78, ఖమ్మం 69, నిజామాబాద్-74, సిద్దిపేట 63, నల్గొండ 61, జగిత్యాల 49, మహబూబ్ నగర్ 45, మంచేర్యాల 44, భుపల్లపల్లి 38, ఆదిలాబాద్ 26 కేసులు నమోదుఅయ్యాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 71.3గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.81 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 2.11 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.




Tags:    

Similar News