Ring Around Sun in Bhadradri Kothagudem: ఆకాశంలో అద్భుతం..భద్రాద్రి రామాలయ శిఖరంపై కాంతి పుంజం!

Ring Around Sun in Bhadradri Kothagudem: ఆకాశంలో అద్భుతం..భద్రాద్రి రామాలయ శిఖరంపై కాంతి పుంజం!
x
Halo Around the sun in bhadradri Kothagudem
Highlights

Ring Around Sun in Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఆకాశంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది.

Ring Around Sun in Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఆకాశంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. నీలాకాశంలో ఇంధ్రదనస్సులోని వర్ణాల రూపంలో ఆ సూర్యుని చుట్టూ ఓ సుందరమైన వలయం ఏర్పడింది. దీంతో ఆలయంపైన ఓ అద్భుతమైన సుందర దృష్యం భద్రాచలం వాసుల్ని కనువిందు చేసింది. భద్రాచలం, కొత్తగూడెం పట్టణాలకు చెందిన ప్రజలు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. భద్రాద్రి జిల్లాలో సూర్యుడి చుట్టూ కనిపించిన ఈ వలయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కనిపించింది.

కొందరు తీసిన ఫొటోల్లో ఓ ప్రకాశవంతమైన చుక్క సూర్యుడిని దాటడం కూడా కనిపించింది. అంతే కాదు కొంత మంది పకృతి ప్రియులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని తమ చరవానుల్లో భద్రపరచుకున్నారు. అంతే కాదు వాట్సాప్ స్టేటస్‌లు‌గా పెట్టుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వలయం నుంచి ఓ కాంతి పుంజం నేరుగా రామాలయ గర్భగుడి శిఖరంపైకి జాలువారినట్లుగా కనిపించింది. గాలిగోపురం చుట్టూ ఏర్పడిన వలయం భక్తులకు కనువిందు చేసింది. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సులా ఏర్పడిన ఈ సుందర వలయాన్ని 'హ్యాలో సినామినా' అని పిలుస్తారని అధికారులు తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories