Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోంది
Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని బండి సంజయ్ అన్నారు. పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య ఖర్చులు భరించలేక.. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే, అక్కడ సరైన సౌకర్యాలు లేక సూది, మందులు, దూది కొరత ఏర్పడుతుందని అసహనం వ్యక్తం చేశారు.
కేంద్ర నిధులను సరిగా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శింంచారు. అతి త్వరలో జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపడతామని.. స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని బండి సంజయ్ హామి ఇచ్చారు.