Balka Suman: దేశంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగిస్తుంది
Balka Suman: ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది
Balka Suman: దేశంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగిస్తుంది
Balka Suman: దేశ భవిష్యత్ కోసం కేంద్రం పని చేయడం లేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయని, ప్రధాని మోడీ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా నాయకుని కోసం ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాల్సిందేనన్నారు. దేశానికి బీజేపీ పీడ పోవాల్సిందేనని, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారన్నారు. దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలువాలంటే కేసీఆర్ నడుం కట్టాలని, తామంతా వెంట ఉంటామన్నారు బాల్కసుమన్. దేశంలో రాక్షస పాలన అంతం కావాలన్న ఆయన.. నయా పాలనకు పునాది పడాలని.. కేసీఆర్ రాక కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని బాల్క సుమన్ అన్నారు.