Hyderabad: హైదరాబాద్‌కు మరో రవాణా సదుపాయం

Hyderabad: ఇద్దరు, ముగ్గురు ప్రయాణించేలా P.R.T.S వాహనాలు

Update: 2022-05-18 02:15 GMT

Hyderabad: హైదరాబాద్‌కు మరో రవాణా సదుపాయం 

Hyderabad: రోజురోజుకు అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో మణిహారం రాబోతుంది. నగరంలో ఉన్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కొత్త వ్యవస‌్థ సిద్ధం అవబోతుంది. ఇప్పటికే ఉన్న రోడ్, రైల్, మెట్రో ట్రాన్స్ పోర్ట్ తో పాటు మరో సిస్టం రాబోతుంది. అయితే అధికారులు ప్లాన్ చేస్తున్నట్టుగా పర్సనలైజ్డ్ రాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం హైదరాబాద్ రోడ్ల పై పరుగులు పెట్టనుందా ఎంత వరకు సాధ్యం అవనుంది.

హైదరాబాద్​ జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే నగర జనాభా కోటి దాటింది. అయితే రోడ్ల విస్తరణ చేస్తున్నా ఫ్లైఓవర్ల సంఖ్య పెరుగుతున్నా ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. సిటీలో తొమ్మిది వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉంటే అందులో మెయిన్ రోడ్లు 1,500 కిలోమీటర్లు ఉంటాయి. మొత్తంగా 54 లక్షల వాహనాలు ఉండగా రోజూ మరో వెయ్యి కొత్త వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. ఇలా పెరిగిపోతున్న వాహనాలతో ట్రాన్స్ పోర్టేషన్ కష్టం అవుతుంది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినా, దానికి సరైన కనెక్టివిటీ లేకపోవడంతో ట్రాఫిక్ అలాగే కనిపిస్తుంది.

సిటీలో రెగ్యులర్ ట్రాఫిక్ తో పాటు వీఐపీల రాకపోకలు పెరిగిపోయాయి. ఆ సమయాల్లో ట్రాఫిక్​ మేనేజ్​మెంట్​ పక్కాగా ఉండాలి. చాలా సేపు వాహనాలను ఆపేస్తుండటం, ఒక్కసారిగా వదలడం ఇబ్బందులకు కారణమవుతోంది. ఇలాంటి సమయంలో పబ్లిక్ రోడ్ మీద ప్రయాణం చాలా లేట్ అవుతుంది. అందుకోసమే పర్సనలైజ్డ్ రాపిడ్ ట్రాన్ప్ పోర్ట్ సిస్టం ను తీసుకురావాలని చూస్తున్నారు. ఐటి కారిడార్ లో మెట్రో రైలుతో ఎంతో ఉపయోగం ఉంది. అయితే, మెట్రో రైలు దిగిన తరువాత కనెక్టింగ్ కోసం ఇబ్బంది అవుతుంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి P.R.T.S ను తీసుకువస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

మెట్రో తరహాలో ఉండే ఈ P.R.T.S వాహనాలు ఇద్దరు ముగ్గురు ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటాయి. విద్యుత్ సహాయంతో అటోమేటిక్ గా చిన్న ట్రాక్ పై పరుగులు తీస్తాయి. లండన్ తో పాటు మరికొన్ని నగరాల్లో ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఐటి కారిడార్ లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లండన్ లాంటి నగరాల్లో దూసుకు పోయే ఈ P.R.T.S వాహనాలు హైదరాబాద్ లో పరుగెత్తించడం ఎంతవరకు సాధ్యమో చూడాలి.

Tags:    

Similar News