Mahahubnagar: చెరువులో చేపలన్నీ మాయం.. రాకాసి చేపలపై మత్స్యకారుల ఆందోళన..

Mahahubnagar: మొసలి ఆకారం, ఒళ్లంతా మచ్చలు, ఆక్వేరియంలో ఓకే.. చెరువులోకి ఎంటరైందో ఇక అంతే సంగతులు.!

Update: 2021-12-30 08:21 GMT

Mahahubnagar: చెరువులో చేపలన్నీ మాయం.. రాకాసి చేపలపై మత్స్యకారుల ఆందోళన..

Mahahubnagar: మొసలి ఆకారం, ఒళ్లంతా మచ్చలు, ఆక్వేరియంలో ఓకే.. చెరువులోకి ఎంటరైందో ఇక అంతే సంగతులు.! రాత్రికి రాత్రే చెరువులోని చేపలు మాయమైపోతాయి, వలలకు వలలే చిధ్రమైపోతాయి.! రెండేళ్లుగా మహబూబ్ నగర్ జిల్లా మత్స్యకారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న వింత చేపపై స్పెషల్ స్టోరీ.!

ఇక్కడ కనిపిస్తున్న రాకాసి చేపగురించి మహబూబ్ నగర్ రైతుల ఆవేదన అంతా సాధారణ చేపలకు భిన్నంగా కనిపిస్తున్న ఈ రాకాసి చేప ఆరు రెక్కలతో భయంకరంగా కనిపిస్తోంది. ఇది చూడడానికే కాదు తినడానికీ డేంజరే అని అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా బుద్దారం చెరువులో ఈ అరుదైన దెయ్యం చేపలు దర్శనమిచ్చాయి. ఈ చేపలు నీటితో పాటు నేలమీద ప్రయాణించగలగడంతో గ్రామంలోని మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇక ఈ చేపల కారణంగా తెలంగాణలోని మత్స్య సంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుకర్ మౌత్ క్యాట్ ఫిష్ జాతికి చెందిన ఈ చేపను ఇక్కడ గుర్తించడం ఇదే తొలిసారి కాగా ప్రపంచంలోనే అతిపెద్ద నది అమెజాన్‌లో మాత్రమే కనిపిస్తుందని, అలాంటిది ఇక్కడ కనిపించడంపై జాలర్లు ఆశ్చర్యం వెలిబుచ్చుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ చేపలు మత్స్యకారులు సాగు చేసే చేపలను తినేయడమే కాకుండా వలలను సైతం నాశనం చేస్తాయి. అత్యంత హానికరమైన ఈ రాకాసి చేప నీరు లేకపోయినా 15 రోజులకు పైగా బతికేస్తుంది. నీటితో పాటు భూమిపైనా ప్రయాణిస్తూ సమీపంలోని జలాల్లోకి ప్రవేశించి అక్కడ తమ సంతతిని పెంచుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ చేపవల్ల పెద్ద ప్రమాదం ఏం లేదని, వీటిని తినకుండా భూమిలో పూడ్చిపెట్టాలంటున్నారు మత్స్యశాఖ అధికారులు.

ఇక ఈ మాన్‌స్టర్ ఫిష్ గత రెండేళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లాలో దర్శనమిస్తోంది. దీంతో చెరువుల్లో చేపలు పెంచే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ రాకాసి చేపలు కృష్టా నది నుంచి చెరువుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Full View


Tags:    

Similar News