Rajasekhar Health Updates: నాన్న కోలుకుంటున్నారు.. రాజశేఖర్ కుమార్తె శివత్మిక ట్వీట్!
Rajasekhar Health Updates: కరోనాతో పోరాడుతున్న సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూతురు శివత్మిక తాజాగా ట్వీట్ చేశారు.
Rajashekar-Shivatmika (file image)
Rajasekhar Health Updates: కరోనాతో పోరాడుతున్న సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూతురు శివత్మిక తాజాగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ కోలుకుంటున్నారని ఆమె చెప్పారు. అంతేకాకుండా హైదరబాద్ లోని టీ న్యూరో ఆసుపత్రి బృందం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి ఎంతో కృషి చేస్తోందని చెప్పిన శివాత్మిక టీ న్యూరో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ను తన ట్వీట్ కు జత చేశారు. 'రాజశేఖర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోంది. వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. హై ఫ్లో ఆక్సిజన్ ను ఆయనకు అందిస్తున్నాం అని డాక్టర్లు ఆ బులిటెన్ లో పేర్కొన్నారు.
రాజశేఖర్ తో పాటూ ఆయన భార్య జీవిత, ఇద్దరు కుమార్తెలు కరోనా బారిన పడ్డారు. అయితే, వీరు ముగ్గురూ కరోనా నుంచి కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ, జీవిత ఇంకా హోమ ఐసోలేషన్ లో ఉన్నారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా ప్రతి రోజూ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులితాన్ విడుదల చేస్తూ వస్తున్నాయి. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం జీవిత కూడా రాజశేఖర్ ఆరోగ్యం కుదుటపడుతోందనీ.. ప్లాస్మా థెరపీ చేస్తుండటం తొ ఆయన వేగంగా కోలుకున్తున్నారానీ చెప్పారు.