Alampur Municipal Results 2026: అలంపూర్‌లో మున్సిపల్ పోరు ‘టై’: కాంగ్రెస్ 5.. బీఆర్ఎస్ 5.. పీఠం దక్కేది ఎవరికి?
Alampur Municipal Results 2026: జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మున్సిపాలిటీ ఫలితాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి.
Alampur Municipal Results 2026: జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మున్సిపాలిటీ ఫలితాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడింది. మొత్తం 10 వార్డులకు గాను ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు సమానంగా స్థానాలను పంచుకున్నాయి.
బలాబలాలు ఇలా:
కాంగ్రెస్ పార్టీ: 05 వార్డులు
బీఆర్ఎస్ పార్టీ: 05 వార్డులు
అలంపూర్‌లో ఇరు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడటంతో ఫలితం సమంగా నిలిచింది. పదికి పది వార్డుల్లోనూ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి చెరో ఐదు స్థానాలతో ఇరు పార్టీలు సరితూగాయి. దీంతో ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎక్స్-అఫీషియో ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. ఇరు పార్టీల నేతలు గెలిచిన అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడ్డారు. అలంపూర్ పీఠంపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో వేచి చూడాలి.