Aiza Municipal Election Results 2026: అయిజలో ఎగిరిన గులాబీ జెండా: మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం.. 13 వార్డుల్లో ఘనవిజయం!

Aiza Municipal Election Results 2026: జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ (BRS) తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

Update: 2026-02-13 05:54 GMT

Aiza Municipal Election Results 2026: జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ (BRS) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పోటాపోటీగా సాగిన ఎన్నికల పోరులో మెజారిటీ స్థానాలను గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకుంది.

గెలుపు లెక్కలు ఇలా:

అయిజ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పార్టీల బలాబలాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

బీఆర్‌ఎస్‌: 13 వార్డులు

కాంగ్రెస్: 07 వార్డులు

మున్సిపాలిటీని చేజిక్కించుకోవడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీని బీఆర్‌ఎస్‌ సాధించింది. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను గెలుచుకున్నప్పటికీ, బీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయింది. ఈ విజయంతో అయిజ పట్టణంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులే తమను గెలిపించాయని ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News