బేగంపేట ఎయిర్ పోర్టులో విమానాల విన్యాసాలు... శని, ఆదివారం రోజుల్లో సామాన్యులకు, విద్యార్థులకు అనుమతి

Begumpet - Aviation Show: సారంగ్ బృందంచే గగనతలాన విమానాల విన్యాసాలు...

Update: 2022-03-25 03:58 GMT

బేగంపేట ఎయిర్ పోర్టులో లోహ విహంగాల సందడి.. ఆరక్షణీయంగా నిలిచిన ఎయిర్ బస్ 350...

Begumpet - Aviation Show: గగన తలానా ఎగిరే భారీ విమానాలు... చూడముచ్చటగా అబ్బురపరచే లోహ విహంగాలు... చూపరులను ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనతో ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్‌ షోకు హైదరాబాద్ బేగంగపేట వేదికగా నిలిచింది. వైమానిక రంగం పట్ల అన్ని విభాగాల్లోనూ అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఏవియేషన్ షో జనరంజకంగా సాగుతోంది. 

గగన తలంలో విమానాల విన్యాసాలు.. ఆసక్తిని రేకెత్తించాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈ ఏవిషన్ షోతో బేగంపేట ఎయిర్ పోర్టు సందడిగా మారింది. ఏవియేషన్ షోలో తొలి రెండు రోజులు వాణిజ్య కార్యకలాపాలు.. పెట్టుబడులు, ఒప్పందాలు, ప్రాంతీయ కనెక్టివిటి, విమానాయానం, హెలికాప్టర్లు, డ్రోన్ల వినియోగంపై విద్యార్థులకు , సాంకేతిక నిపుణులకు, వ్యాపార రంగాలకు అవగాహన కల్పిస్తారు. ఏవిషేషన్ షోలో ఎయిర్ బస్ 350 ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలింది.

షోకోసం వచ్చే సందర్శకులకు సారంగ్ టీమ్స్ అభ్బుమైన సందేశమి చ్చారు. పౌర విమానయాన రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి హోటల్ తాజ్ కృష్ణలో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు జరిగే కార్యక్రమంలో వింగ్స్‌ ఇండియా అవార్డులను ప్రదానం చేస్తారు. ఈవెంట్ లో భాగస్వాములు కానున్న విదేశీ ప్రముఖులు, రాయబారులు, ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఏజెన్సీలు, సివిల్ ఏవియేషన్ అథారిటీలు, ఇంజినీరింగ్, కన్సల్టెంట్ వంటి ఏవియేషన్‌లోని వివిధ రంగాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఎయిర్ షోలో శని, ఆదివారం రోజుల్లో సామాన్యులను, విద్యార్థులను అనుమతిస్తారు. న్యూ హరిజోన్ ఎట్ 75వసంతాల భారతంలో న్యూ హరిజోన్ ఏవిషేషన్ ఫర్ సంబరాలు సమైక్యతను దూరం చేస్తాయి.

Tags:    

Similar News