Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 1700 స్కూళ్లు మూతపడ్డాయి
Harish Rao: మన ఊరు-మనబడి పనులను మధ్యలోనే నిలిపేసింది
Harish Rao
Harish Rao: ఈ విద్య సంవత్సరంలోనే 1700 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని మాజీమంత్రి, హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసి భవనంలో గురు పూజోత్సవం సందర్బంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు నాలుగు DAలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మన ఊరు మన బడి పనులను ఈ ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసిందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాల్సి ఉందన్నారు.