రిజర్వేషన్లు ఉన్నా సర్పంచ్‌గా పోటీ చేసేవారు కరువు.. ఆసిఫాబాద్ జిల్లాలో విచిత్ర పరిస్థితి
రాష్ట్రమంతా సర్పంచ్ అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీ చేస్తుంటే ఆ గ్రామాలలో మాత్రం అభ్యర్థులే లేరంటా.
రిజర్వేషన్లు ఉన్నా సర్పంచ్‌గా పోటీ చేసేవారు కరువు.. ఆసిఫాబాద్ జిల్లాలో విచిత్ర పరిస్థితి
రాష్ట్రమంతా సర్పంచ్ అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీ చేస్తుంటే ఆ గ్రామాలలో మాత్రం అభ్యర్థులే లేరంటా. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రాహపల్లిలో ఎస్టీ, చిలాటి గూడ ఎస్సీ వర్గాలకు సర్పంచ్ అభ్యర్థిగా రిజర్వ్ అయ్యింది. కాని అక్కడ ఎస్టీ, ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు లేకపోవడంతో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. దీనికి తోడు వార్డులకు సైతం నామినేషన్ వేసే వారు లేక వార్డుల స్థానాలు కూడా ఖాళీగా ఉండే అవకాశం ఏర్పండింది. రిజర్వేషన్ మార్చాలని కలెక్టర్‌కు గ్రామస్థులు వినతి ప్రతాలు అందించిన ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహపల్లి గ్రామపంచాయతిలో 8 వార్డులు ఉండగా నాలుగు ఎస్టీకి రిజర్వు అయ్యాయి మిగతా నాలుగు బీసీకి రిజర్వు కావడంతో నాలుగు స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలు అయ్యాయి. చిలాటి గూడ పంచాయతీలో 8 వార్డులు ఉండగా 7 బిసికి కేటాయించగా 1 ఎస్సీకి కేటాయింపు జరిగింది. ఎస్సీ కేటాయించిన వార్డులో నామినేషన్ దాఖలు కాలేదు. రెండు పంచాయతీలలోను ఎస్సీ ,ఎస్టీ సామాజిక వర్గాల చెందిన వారు లేకపోవడంతో సర్పంచ్ ఎన్నిక ను వాయిదా వేసి రిజర్వేషన్లు మార్చాలని ఆ పంచాయతీ ప్రజలు గతంలోనే ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. అయినప్పటికీ యంత్రాంగం మాత్రం సర్పంచ్ స్థానాలకు చెందిన రిజర్వేషన్ల మార్పును చేపట్టలేదు. ఇప్పటికైనా అంధికారులు స్పందించి రిజర్వేషన్లు మార్చాలని ప్రభుత్వాని వేడుకుంటున్నారు.